ఆయుధ పరిజ్ఞానం అవసరం: ఎస్పీ
NEWS Jan 31,2025 05:03 pm
పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధ పరిజ్ఞానం కలిగి ఉండాలణి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించి సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు