Logo
Download our app
కనీస వసతులు లేని బ‌స్టాండ్
NEWS   Jan 31,2025 05:28 pm
గంగాధర ఎక్స్ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. 4 మండలాలకు ప్రధానకూడలిగా, జిల్లా కేంద్రానికి చేరువలో కరీంనగర్-నిజామాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న గంగాధర ఆర్టీసీ బస్టాండ్‌ను ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ముందు భాగంలో సీసీ లేక దుమ్ముధూళితో ప్రయాణికులు ఇబ్బందులు ఎుర్కొంటున్నారన్నారు. బస్టాండులో తాగు నీటి సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట లైటింగ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source