కేసీఆర్ కు బొట్టు పెట్టి పిలవాలా..?
NEWS Jan 31,2025 02:08 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై. పలుమార్లు శాసన సభకు హాజరు కావాలని ఆహ్వానం పంపించినా పట్టించు కోలేదన్నారు. ఫాం హౌస్ కు పరిమితమైన కేసీఆర్ కావాలని ప్రభుత్వాన్ని, తమను బద్నాం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసినందుకే తమకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు.