విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు ఓకే
NEWS Jan 31,2025 01:00 pm
రాజ్యసభ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డికి భారీ ఊరట లభించింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు లైన్ క్లియర్ ఇచ్చింది. ఫ్రాన్స్ , నార్వే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. తన విదేశీ టూర్ కు సంబంధించి నెల రోజుల పాటు పర్మిషన్ ఇవ్వాలని కోరారు పిటిషన్ లో. కాగా కోర్టు మాత్రం కేవలం 15 రోజులు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు ఎప్పుడైనా వెళ్లవచ్చని పేర్కొంది.