విశాఖ ఉక్కుకు ఊపిరి పోస్తాం
NEWS Jan 31,2025 03:29 am
కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామి కీలక ప్రకటన చేశారు. ఆయన విశాఖలో పర్యటించారు. ఈ సందర్బంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పలుమార్లు నారా లోకేష్ తనను కలిసి విన్నవించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం పదే పదే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కోరారని తెలిపారు. ఆరు నూరైనా సరే విశాఖ ఉక్కుకు జీవం పోస్తామన్నారు.