Logo
Download our app
మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం
NEWS   Jan 30,2025 12:05 pm
ప్ర‌యాగ్ రాజ్ లో కొనసాగుతున్న మ‌హా కుంభ మేళాలో రోజుకో ఘ‌ట‌న చోటు చేసుకుంటోంది. నిన్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 30 మంది మృత్యువాత‌కు గురి కాగా గురువారం సెక్టార్ 22లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఏర్పాటు చేసిన టెంట్లు పెద్ద ఎత్తున త‌గ‌ల‌బ‌డ్డాయి. మంట‌ల‌ను ఆర్పేందుకు అగ్ని మాప‌క సిబ్బంది ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాగా ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ప్ర‌భుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.
⚠️ You are not allowed to copy content or view source