శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.14 కోట్లు
NEWS Jan 30,2025 04:34 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 62 వేల 710 మంది భక్తులు దర్శించుకున్నారు. 15 వేల 635 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.14 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.