Logo
Download our app
హుస్సేన్‌సాగర్ ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వండి
NEWS   Jan 30,2025 03:44 am
హుస్సేన్ సాగ‌ర్ లో జ‌రిగిన బోటు అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయ్యింది రాష్ట్ర బీసీ క‌మిష‌న్ . ఘ‌ట‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే నివేదిక స‌మ‌ర్పించాల‌ని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ను ఆదేశించారు క‌మిష‌న్ చైర్మ‌న్ నిరంజ‌న్. ఈ మేర‌కు క‌మిష‌న్ లేఖ రాసింది. ఫిబ్ర‌వ‌రి 1న సాయంత్రం 5 గంట‌ల లోపు ఈ రిపోర్టు అందాల‌ని, లేక పోతే తీవ్ర చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. మ‌రో వైపు ఘ‌ట‌న‌కు పూర్తి బాధ్య‌త కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, గ‌వ‌ర్న‌ర్ బాధ్య‌త వ‌హించాల‌ని ప్ర‌జా సంఘాలు ఆరోపించాయి.
⚠️ You are not allowed to copy content or view source