కేసీఆర్ ను ఢీకొన్న వ్యక్తి రేవంత్ ఒక్కడే
NEWS Jan 29,2025 04:49 pm
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ సందర్బంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బలమైన నాయకుడని, తనను ఎవరూ ఎదుర్కోలేక పోయారని అన్నారు. తనకు ధీటుగా నిలబడి పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని కుండ బద్దలు కొట్టారు. ఇదే సమయంలో తనకు అడ్డు రాకుండా ఉండేందుకు చాలా మంది లీడర్లను తొక్కేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.