మున్సిపల్ ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్
NEWS Jan 29,2025 04:41 pm
కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల ప్రత్యేకాధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కామారెడ్డిలో మున్సిపల్ కమిషనర్ స్పందన, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. బల్దియాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం బాన్సువాడలో అధికారులతో సమావేశం నిర్వహించారు.