కుంభ మేళా ఘటన బాధాకరం
NEWS Jan 29,2025 09:30 am
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 20 మంది దుర్మరణం చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు జాగ్రత్తగా ఉండాలని, తొందర పడవద్దని పవన్ సూచించారు.