అబద్దాలు చెప్పడంలో బాబు నెంబర్ వన్
NEWS Jan 29,2025 07:06 am
అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ అన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనంటూ కొట్టి పారేశారు. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, దీని నుంచి దృష్టి మరల్చేందుకు తమను టార్గెట్ చేశారంటూ ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి.