Logo
Download our app
వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగం అభివృద్ధి
NEWS   Jan 29,2025 06:32 am
వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. బుధవారం రాజంపేట పోలి చెరువులో కూటమి నాయకులతో కలిసి ఐదు లక్షల చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source