క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
NEWS Jan 28,2025 09:57 am
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం గాలివీడు జడ్‌పి ఉన్నత పాఠశాలలో మండిపల్లి నాగిరెడ్డి జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.