సీఎం సహాయనిధి చెక్ అందించిన ప్రభుత్వ విప్
NEWS Jan 28,2025 10:49 am
ఆపదలో ఉన్న వారికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించే సహాయాన్ని ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మంగళవారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన 50 వేల రూపాయల చెక్ ను చిట్వేలు మండలం మైలపల్లి కి చెందిన చెవ్వు వెంకటరెడ్డి కుటుంబానికి అందించారు. గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.