Logo
Download our app
ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ పై కేసు న‌మోదు
NEWS   Jan 28,2025 03:48 am
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ కు బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌తో పాటు మ‌రో 18 మందిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2014లో తనను హనీ ట్రాప్ కేసులో ఇరికించార‌ని, స‌ర్వీస్ నుండి తొల‌గించారంటూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గ‌ప్ప ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source