10 జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులకు బహుమతులు
NEWS Jan 27,2025 06:34 pm
10 జీపీఏ వచ్చిన విద్యార్థులందరికీ ప్రత్యేక బహుమతులను అందజేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణ పరిధిలోని ఏకిన్పూర్ గ్రామ ZPHS పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ఆయన సమావేశం అయ్యారు. పరీక్షల్లో 10 GPA వచ్చేలా విద్యార్థులు ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించుకొని సన్నద్ధం కావాలని సూచించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.