సిఐకి లయన్స్ క్లబ్ సభ్యుల సన్మానం
NEWS Jan 27,2025 06:31 pm
మెట్ పల్లి సీఐ ఏ.నిరంజన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పోలీస్ మెడల్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు సీఐని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇల్లెందుల శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.