విమర్శలు..వివాదాలకు దూరంగా ఉండాలి
NEWS Jan 27,2025 02:41 pm
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు వ్యక్తిగత విమర్శలు చేయొద్దని, వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు నడుచు కోవాలన్నారు. గీత దాటాలని ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలోచనలు పంచుకోవాలే తప్పా మీ అభిప్రాయాలను రుద్దాలని చూడొద్దన్నారు. పార్టీ ఆశయాలను, సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు.