రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్
NEWS Jan 27,2025 04:53 am
రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అని, ఏడాదికే కాంగ్రెస్ గ్రాఫ్ కుప్ప కూలిపోయిందని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. హామీల అమలులో ప్రజలకు సర్కారు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసగిస్తున్నదని, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు రోజుకో నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.