Logo
Download our app
స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
NEWS   Jan 27,2025 04:15 am
స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ గిగ్, ప్లాట్ ఫార‌మ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ అధ్య‌క్షుడు షేక్ స‌లావుద్దీన్. స‌రైన వేత‌నాలు చెల్లించ‌డం లేద‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరుతూ చేప‌ట్టిన స‌మ్మెకు తాము సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అనుకోని ప్ర‌మాదాలు జ‌రిగితే ఆర్థిక సాయం అందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source