ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం
NEWS Jan 27,2025 05:44 pm
నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల నుండి ఉన్నట్టుండి పొగలు, మంటలు రావడంతో స్థానికులు గమనించిన అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది.పాఠశాలలోని పాత భవనం స్టోర్ గదిలో భద్ర పరిచిన సామాగ్రి, ఫైళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. కిటికీలో నుంచి ఎవరైనా ఆకతాయిలు నిప్పు పడేసి అంటించారా తేలాల్సి ఉంది.