గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సీఎం భేటీ
NEWS Jan 26,2025 01:53 pm
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇవాళ కోస్గి కేంద్రంగా ప్రారంభించిన నాలుగు పథకాలు, వివిధ అంశాలను గవర్నర్ కు వివరించారు. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై చర్చించారు. అంతే కాకుండా ఇంకా మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి కూడా వివరించినట్లు సమాచారం.