అర్ధరాత్రి దాటాక రైతుల ఖాతాల్లో నగదు
NEWS Jan 26,2025 11:10 am
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నాలుగు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్ధరాత్రి దాటాక రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని వెల్లడించారు. తాము మాట ఇచ్చామంటే తప్పమన్నారు. గత ప్రభుత్వం గాలి కబుర్లు చెప్పిందని, తెలంగాణ పేరుతో విధ్వంసానికి పాల్పడిందన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందన్నారు.