జాతీయ జెండాను ఆవిష్కరించిన ముర్ము
NEWS Jan 26,2025 05:38 am
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. కర్తవ్య పథంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. చారిత్రాత్మక దినోత్సవాన్ని స్మరించుకోవడంలో దేశాన్ని నడిపించారు రాష్ట్రపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, ఆయన సతీమణి, కేంద్ర మంత్రులు, భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి, వివిధ త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు.