పద్మ అవార్డులపై సీఎం సీరియస్
NEWS Jan 26,2025 05:26 am
కేంద్ర సర్కార్ పై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కేంద్రం అత్యున్నతమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఏపీకి ప్రయారిటీ ఇవ్వగా తెలంగాణ పట్ల వివక్ష చూపించింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి పలువురిని ఎంపిక కోసం సిఫారసు చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీఎం. సర్కార్ తరపున గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు ల పేర్లను పంపించింది. వీరిలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదు.