Logo
Download our app
ఏపీలో జ‌గ‌న్ చాప్ట‌ర్ క్లోజ్
NEWS   Jan 26,2025 04:46 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న సోద‌రుడు, వైసీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, పార్టీకి సంబంధించిన నేత‌ల విశ్వాసాన్ని కోల్పోయాడ‌ని అన్నారు. ఒక ర‌కంగా ఏపీలో త‌న చాప్ట‌ర్ క్లోజ్ అయ్యిందంటూ పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప‌రంగా త‌న ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌న్నారు. జ‌గ‌న్ కు న‌మ్మిన బంటు విజ‌య సాయి రెడ్డి అని, త‌నను అన‌రాని మాట‌లు అన్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్, విజ‌య సాయి క‌లిసి డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source