బాలికలు ఉన్నత స్థాయికి ఎదగాలి: జడ్జి
NEWS Jan 25,2025 05:25 pm
బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. బాలికల దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి శివారు ఆరపేట ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో మండల్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బాలికలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.