ఇబ్రహీంపట్నంలో ఓటర్ దినోత్సవ ర్యాలీ
NEWS Jan 25,2025 03:22 pm
ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు బస్టాండ్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నినాదాలు చేశారు. సమాజంలో మార్పు కోసం ఓటు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.