Logo
Download our app
అభివృద్ధి కోసం ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తాం
NEWS   Jan 25,2025 10:26 am
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ అన్నారు. .గత ప్రభుత్వం లెక్కలేని ఖర్చులతో, అక్రమాలతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. మోర్తాడ్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source