Logo
Download our app
రోడ్డుపై గుంతల పూడ్చివేత
NEWS   Jan 25,2025 10:27 am
మోపాల్ మండలం మంచిప్ప-నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను మోపాల్‌ మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తూర్పు రాజేశ్‌ ఆధ్వర్యంలో పూడ్చేశారు. ఇటీవల గుంతల కారణంగా ఓ మహిళ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే విధంగా గుంతలతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. కావున యూత్‌ ఆధ్వర్యంలో సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఏర్పడిన గుంతలను మొరంతో పూడ్చివేశారు. యువతను గ్రామస్తులు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source