Logo
Download our app
కాలం చెల్లిన భ‌వ‌నాల పున‌ర్ నిర్మాణం
NEWS   Jan 25,2025 04:50 am
తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాల స్థానంలో పునర్ నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సుదర్శనం, గోవర్ధన్, కళ్యాణి, సి-టైప్ క్వార్టర్లు, పద్మావతి విశ్రాంతి గృహాల తాజా పరిస్థితిని పరిశీలించారు. భ‌క్తుల నుండి ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, ఆరు ద‌శాబ్దాల కింద‌ట నిర్మించ‌డంతో రిపేర్ కు వ‌చ్చాయ‌న్నారు. ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా పున‌ర్ నిర్మిస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source