ఆంధ్ర శశికళ సజ్జల - డొక్కా
NEWS Jan 25,2025 04:27 am
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన ఎంపీలు విజయ సాయి రెడ్డి, అయోధ్యా రెడ్డిలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. వారి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సజ్జల రామకృష్ణా రెడ్డి నిర్వాకం కారణంగానే పార్టీ నాశనమైందని ఆరోపించారు. తాను బయటకు రావడానికి కూడా తనే కారణమని ఆరోపించారు. సజ్జల ఆంధ్రా శశికళ అంటూ నిప్పులు చెరిగారు.