Logo
Download our app
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్
NEWS   Jan 25,2025 03:57 am
గోదావ‌రి పుష్క‌రాల‌కు ముహూర్తం ఖ‌రారైంది. వ‌చ్చే 2027 సంవ‌త్స‌రం జూలై 23 నుంచి ఆగ‌స్టు 3 వ‌ర‌కు పుష్క‌రాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం. ప్రతీ 12 ఏళ్ల‌కు ఒక‌సారి పుష్క‌రాలు వ‌స్తాయి. ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లు మొద‌లు పెట్టింది. ఈసారి పుష్క‌రాల కోసం ఏకంగా 8 కోట్ల మందికి పైగా వస్తార‌ని అంచ‌నా వేస్తోంది. 2015లో ఇదే గోదావ‌రి పుష్కరాల ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ముందు జాగ్ర‌త్త‌గా ఇప్ప‌టి నుంచే ఫోక‌స్ పెట్టింది.
⚠️ You are not allowed to copy content or view source