ఫిబ్రవరి 4న రథసప్తమి
NEWS Jan 25,2025 03:52 am
తిరుపతిలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 4న రథ సప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది టీటీడీ. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథస ప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామీ అమ్మ వార్లు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.