శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.73 కోట్లు
NEWS Jan 25,2025 03:26 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. నిన్న శ్రీవారిని 57 వేల 655 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 51 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.73 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 10 గంటలకు పైగా సర్వ దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు.