కీచక అధికారిపై సర్కార్ వేటు
NEWS Jan 24,2025 08:23 am
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప రవాణా శాఖలో కీచక అధికారి వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. బాధిత మహిళలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రవాణా శాఖకు మంచి పేరు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేయాలని ఉద్యోగులకు హితవు పలికారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.