Logo
Download our app
రేషన్‌ కార్డు కోసం భిక్షాటన చేస్తూ నిరసన
NEWS   Jan 24,2025 08:02 am
బీబీపేట మండలం యాడారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామానికి చెందిన ముస్తాబాద్‌ అనిల్‌ గౌడ్‌ అనే యువకుడు రేషన్‌ కార్డు కోసం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల పొరపాటు వల్లే తనకు అన్యాయం జరిగిందని ఆరోపించాడు. ప్రజాపాలన, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తులు చేసుకొని పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగినా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు.
⚠️ You are not allowed to copy content or view source