శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు
NEWS Jan 24,2025 04:16 am
తిరుమల శ్రీవారిని 56 వేల 225 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 588 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.