Logo
Download our app
చిత్తూరు ఎస్పీ మ‌ణికంఠ‌కు పుర‌స్కారం
NEWS   Jan 24,2025 04:03 am
రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త ఏడాది 2024లో ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించినందుకు గాను చిత్తూరు జిల్లా ఎస్పీ వీఎన్ మ‌ణికంఠ చందోలుకు అరుదైన పుర‌స్కారానికి ఎంపిక చేసింది. ఈనెల 25న 15వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్బంగా విజ‌యవాడ‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో త‌న‌కు అవార్డును అంద‌జేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్రతా ఏర్పాట్లు చేశారు ఎస్పీ. ఈ మేర‌కు ఆయ‌న‌కు ఈ అవార్డు ద‌క్కింది.
⚠️ You are not allowed to copy content or view source