చంద్రబాబు కామెంట్స్ బక్వాస్
NEWS Jan 24,2025 03:37 am
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం గౌతం అదానీకి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే దేశాన్ని, రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న అదానీపై ఎందుకంత ప్రేమ అంటూ నిలదీశారు. అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకం కోడై కూస్తున్నా ఇంకా ఆధారాలు లభించడం లేదంటూ చెప్పడం దారుణన్నారు.