Logo
Download our app
పీయూష్ గోయల్ ని కలిసిన ఎంపీ అర్వింద్
NEWS   Jan 23,2025 03:05 pm
ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి కేంద్ర వాణిజ్య శాఖమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కల సాకారమైందనందున పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని కోరారు. త్వరలో పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం చేస్తామని ఈ సందర్బంగా తెలిపారు. వారి వెంట జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్యనారాయణ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source