Logo
Download our app
ఏపీ నెక్ట్స్ సీఎం నారా లోకేష్
NEWS   Jan 23,2025 10:44 am
ఓ వైపు హైకమాండ్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చినా టీడీపీ నేత‌లు ప‌ట్టించు కోవ‌డం లేదు. నారా లోకేష్ నెక్ట్స్ సీఎం అంటూ గొంతు విప్పుతున్నారు. లోకేష్ పుట్టిన రోజు వేడుక‌లు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర వ‌ల్ల‌నే పార్టీకి భారీగా సీట్లు వ‌చ్చాయ‌న్నారు. చంద్ర‌బాబు త‌ర్వాత కాబోయే ముఖ్య‌మంత్రి లోకేష్ అంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.
⚠️ You are not allowed to copy content or view source