యూనిఫాంకు మచ్చ తెస్తే ఊరుకోం
NEWS Jan 23,2025 10:18 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీస్ యూనిఫాంకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమిలంగా మారారని, రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని అన్నారు. యూనిఫాం ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గమన్నారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డీజీపీని.