Logo
Download our app
భూ వివాదంతోనే సోదరుడి హత్య
NEWS   Jan 23,2025 06:25 am
రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో ఇటీవల జరిగిన పొక్కలి రవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యుల మధ్య నెల కొన్న భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలిపారు. అన్నదమ్ములైన పొక్కలి రవి, పొక్కలి కిష్టయ్యల మధ్య భూమి పంపకాల్లో గొడవలు జరిగాయి. ఈనేపథ్యంలో రవిని హత్య చేయడానికి అన్న కిష్టయ్య పథనం పన్ని, షేక్‌ ఆఫీజ్‌, చాకలి నర్సోల్ల రాకేష్‌కు సుపారీ ఇచ్చాడు. దీంతో రవి (41)ని ఈనెల 19న ఇంట్లోనే హత్య చేశారు. ఏఎస్పీ ప్రత్యేకంగా టీంకు అభినందనలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source