బిల్ గేట్స్ తో బాబు..లోకేష్ భేటీ
NEWS Jan 23,2025 04:05 am
దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు సందర్బంగా దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఏపీలో ఐటీ అభివృద్దికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్శిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని విన్నవించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు బిల్ గేట్స్.