శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రెడ్ అలర్ట్
NEWS Jan 23,2025 02:42 am
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను జల్లెడ పడుతున్నాయి. భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నాయంటూ సమాచారం అందడంతో రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అప్రమత్తం అయ్యాయి. జనవరి 30వ తేదీ వరకు ఎయిర్ పోర్టుకు సందర్శకులు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.