Logo
Download our app
నిందితునికి శిక్ష పడడం సంతోషదాయకం మెట్ పల్లి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంగాసాగర్
NEWS   Jan 22,2025 08:49 am
కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితునికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడం హర్షించదగ్గ విషయమని మెట్‌పల్లి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంగాసాగర్ అన్నారు. ఈ కేసులో మరి కొంతమంది నిందితులుగా ఉన్నారని వారికి కూడా శిక్షపడేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ డాక్టర్ పి రవి, ట్రెజరర్ నిర్మల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అమరేశ్వర్, సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి, ఐఎంఏ మహిళ ప్రతినిధి డాక్టర్ రాజ్యలక్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source