బ్యాంకు, ఎటీఎంల వద్ద భద్రత పాటించాలి
NEWS Jan 20,2025 06:12 pm
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల సిబ్బందితో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 129 బ్యాంకులు, 90 ATMలు ఉన్నట్లు గుర్తించమని బ్యాంకుల్లో పని చేస్తున్న అధికారులు ఎటిఎంల వద్ద భద్రత ప్రమాణాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో జరిగిన ఆర్థిక నేరాలు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు.