Logo
Download our app
అభివృద్ధిని ప్రశ్నిస్తే దాడులా?
NEWS   Jan 20,2025 05:24 pm
మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై ఇటీవల కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని మండల బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. మండల కేంద్రంలో సోమవారం వారు మాట్లాడారు. తమ పార్టీ 10ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసిన ఇలాంటి దాడులకు పాల్పడలేదన్నారు. రవిశంకర్ ఇంటిపై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మధుసూదన్ రావు, తిరుపతి రెడ్డి, అజర్, రాయమల్లు, త్రినాథ్, కుమార్, చందు, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source